ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పత్తి సి. సి. కొనుగోలు కేంద్రంను ప్రారంభించారు. .. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సారి వర్షాలు పెద్ద ఎత్తున కురవడంతో పత్తి పంట రైతులు నష్టపోయారు వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా తొమ్మిది సి. సి. కేంద్రాలు ఏర్పాటు చేశామని దళారులను ఆశ్రయించి మోసపోవద్దని అన్నారు . రైతులందరు తేమశాతం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది పేద ప్రజల ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అని అన్నారు. రైతులు తీసుకొచ్చిన పత్తి లో కోత విధిస్తే సహించబోమని వేబ్రిడ్జి కాటాలో తేడా వస్తే మిల్లు సీజ్ చేయిస్తామని హెచ్చరించారు. రెండు లక్షల ఎకరాల్లో 20 టన్నుల పంట ఉత్పత్తి అవుతుందని
అన్నారు. ఇది రైతుల పక్షపాత ప్రభుత్వం అని ఏ రైతుకు ఎక్కడ ఇబ్బంది కలుగకుండా చూడాలని కోరారు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రెండు లక్షల రూపాయల బుణమాఫీ కోసం 18వేల కోట్ల కెటాయించి మాఫీ చేశామని అన్నారు. ప్రతిపక్షాలు వార్వలేక కారుకూతలు కూస్తున్నారని అన్నారు. మిగతా అర్హులైన రైతులందరికీ తల తాకట్టు పెట్టైన రుణమాఫీ చేస్తామని అన్నారు డిసెంబర్ లోపే 13 వేల కోట్ల రుణమాఫీ అమలు చేసి తీరుతామని దీపావళి నుండి అర్హులైన పేదలకు అందరికీ ఇందిరమ్మ ఇళ్ళు దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వబోతున్నామని ఆనాడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఇల్లు కట్టిచారో ఇప్పుడు కూడా అలాగే ఇస్తాం. వరికి సన్నారకం వడ్లకు 500 బోనస్ ఇస్తామని చెప్పాము,ఇవ్వబోతున్నమనిధాన్యంలో తేమ శాతం కోసం రైతులు ఎండబెట్టుకుని తీసుకురావాలని సూచించారు. సీసీఐ నామ్స్ ప్రకారం రైతులు పత్తిని తీసుకురావాలని ఒక్క కేజీ తరుగు తీయవద్దని హెచ్చరించారు కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావాలని రైతులను కోరారు. రైతులు పిర్యాదు చేస్తే అధికారులమీద చర్యలు తీసుకుంటామని రైతులకు ఎక్కడ నష్టం కలుగకుండా చూడాలనిరైతుల అవసరం, కష్టాలు తీర్చాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు..
పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి పొంగులేటి
 Minister Ponguleti Srinivas Reddy inaugurated a cotton purchase center in Khammam, assuring support to farmers affected by recent rains and emphasizing government efforts for their welfare.
				Minister Ponguleti Srinivas Reddy inaugurated a cotton purchase center in Khammam, assuring support to farmers affected by recent rains and emphasizing government efforts for their welfare.
			
 
				
			 
				
			