నగరంలోని మూలాపేటలో వెలసివున్న శ్రీశ్రీశ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. కార్తీక మాసం ఏర్పాట్లను పరిశీలించారు. నగరపాలక సంస్థలోని వివిధ శాఖల అధికారులతో కొంత సేపు సమీక్షించారు. ఆలయం వెలుపల, బయట ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్, నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జడ్పీటీసీ విజేత, స్థానిక నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మూలాస్థానేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన మంత్రి నారాయణ
 Minister Narayana inspected the arrangements at Mulasthaneswara Swami Temple in Moolapeta, emphasizing hygiene and smooth facilities for devotees.
				Minister Narayana inspected the arrangements at Mulasthaneswara Swami Temple in Moolapeta, emphasizing hygiene and smooth facilities for devotees.
			
 
				
			 
				
			 
				
			