ఆమదాలవలస మండలం రావికంటిపేట గ్రామంలో సోమవారం ఉదయం భూముల రీ సర్వే పూర్తయిన గ్రామాలలో సమస్యల పరిష్కారం కోసం గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు హాజరై వివిధ అంశాలపై మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూముల రీసర్వే కి సంబంధించి ప్రజలకు ఎటువంటి సమస్య ఏర్పడిన దానికి సంబంధించిన దరఖాస్తులను ఏ విధంగా చేసుకోవాలో ఎమ్మెల్యే వివరించారు.
రావికంటిపేట గ్రామసభలో భూముల రీసర్వే సమస్యలపై చర్చ
A grama sabha was held in Ravikantipeta to address issues arising from the land resurvey. MLA Ravikumar guided villagers on submitting applications for resolving concerns.
