పల్లగుట్టలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కడియం శ్రీహరి

Former Deputy CM Kadiyam Srihari inaugurated a paddy procurement center, emphasizing Congress's commitment to farmer welfare and promised fair support prices for produce. Former Deputy CM Kadiyam Srihari inaugurated a paddy procurement center, emphasizing Congress's commitment to farmer welfare and promised fair support prices for produce.

చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో, వెంకటాద్రి పేట గ్రామములో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే రైతులకు న్యాయం జరుగుతోందని అన్నారు.. రైతులకు 2 లక్షలు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతోందన్నారు. రానున్న రోజుల్లో వారికి అనేక సంక్షేమ ఫలాలు అందనున్నాయని తెలిపారు. పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలన్నారు. ధాన్యం ఏ గ్రేడ్ 2,320, బీ గ్రేడ్ 2,300, సన్నరకానికి అదనంగా 500 బోనస్ చెల్లిస్తామన్నారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. . గత ప్రభుత్వాలు ప్రభుత్వపరంగా రావాల్సిన సబ్సిడీలను అందించలేదని విమర్శించారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ప్రతీ ధాన్యం గింజను ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *