రక్తదాన శిబిరంలో పోలీసుల విశేష భాగస్వామ్యం

In Godavarikhani, a blood donation camp was organized by police with Lions Club support, emphasizing the importance of blood donation to save lives. In Godavarikhani, a blood donation camp was organized by police with Lions Club support, emphasizing the importance of blood donation to save lives.

మన జీవితంలో రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయాలి అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల (ఫ్లాగ్ డే) సందర్భంగా గోదావరిఖని సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ వారి సహకారంతో గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో రక్తదానం శిభిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికిశిబిరాన్ని ముఖ్య అతిధిగా పోలీస్ కమిషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి గారు హాజరై పోలీస్ అధికారులతో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీపీగారు మాట్లాడుతూ.. అమరవీర జవానులను స్మరించుకుంటూ అక్టోబర్ 21 నుండి అక్టోబర్ 31 వరకు పోలీస్ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అందులో భాగంగా కమీషనరేట్ పరిధిలో రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగింది అని తెలిపారు. అన్నిటికంటే గొప్పదానమైన రక్తదానం ద్వారా ప్రాణాలు కాపాడాలని సూచించారు. సకాలంలో రక్తం అందించలేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయ్యారని రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చని అన్నారు.

రక్తదానం ఇవ్వడానికి వాలంటరీగా వచ్చిన వారి అందరిని సీపీ అభినందనలు తెలిపారు. శిబిరంలో పోలీసులతో పాటు స్థానిక యువత 200 మంది పాల్గొని ఉత్సాహంగా రక్తదానం చేయడానికి రావడం ఎంతో అభినందనీయమని హర్షం వ్యక్తం చేశారు. సీపీ గారు రక్తదానం చేసిన వారికి సర్టిఫికేట్లను అందజేశారు.

కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ రమేష్ గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, గోదావరిఖని 2 టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు, రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్, మంథని సిఐ రాజు, గోదావరిఖని సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *