సత్తుపల్లి లో డీజిల్ దొంగతనం

In Sathupally, hundreds of liters of diesel were stolen from trucks parked on the highway, raising concerns among drivers and local truck owners. In Sathupally, hundreds of liters of diesel were stolen from trucks parked on the highway, raising concerns among drivers and local truck owners.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో నడి రోడ్డుపై నడి పట్టణంలో పెట్టిన లారీల నుంచి వందల లీటర్ల డీజిల్ దొంగతనం జరిగింది. ఈ ఘటనతో అటు బాధిత డ్రైవర్లను, ఇటు స్థానిక లారీ ఓనర్స్ ను కలవరపెడుతుంది. గత రాత్రి వైజాగ్ నుంచి, హైదరాబాద్ వైపు వెళుతున్న మూడు లారీలు, సత్తుపల్లి జెవిఆర్ కాలేజ్ గ్రౌండ్ సమీపంలో హైవే పక్కకు ఆపి నిద్రిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన దొంగలు తమ చేతివాటం చూపించారు. ఆయిల్ ట్యాంకర్ల క్యాప్ లను, లారీ ఇండికేటర్ వైర్లను తొలగించి ఈ డీజిల్ దొంగతనానికి పాల్పడ్డారు. 400 కెపాసిటీతో ఉండే ఈ డీజిల్ ట్యాంకర్ లలో ఒక్కో డీజిల్ ట్యాంక్ నుంచి సుమారు 300 లీటర్లు, మొత్తం 900 లీటర్ల దొంగతనం జరిగినట్లు లారీ డ్రైవర్లు చెబుతున్నారు. సత్తుపల్లి పట్టణంలో డివైడర్ లైటింగ్, పట్టణంలోనే పోలీస్ స్టేషన్, సింగరేణి లారీ అసోసియేషన్ తో సేఫ్టీ ఉంటుంది అనే ధీమాతో లారీలు పక్కకు ఆపి రెస్ట్ తీసుకుంటున్న సమయంలో ఇలా డీజిల్ దొంగతనం జరగటం ఆశ్చర్యానికి గురిచేస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దొంగతనం జరిగిన తీరును స్థానిక లారీ అసోసియేషన్ చూసి భయాందోళనకు గురవుతున్నారు. నిత్యం తమ లారీలు రోడ్డు వెంబడే పార్కింగ్ చేసి ఉంచుతున్నాం… ఎప్పుడు ఏమి జరుగుతుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *