పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా పట్టణంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ప్రజారక్షణలో శాంతి భద్రతల పరిరక్షణలో నిబద్ధత విధి నిర్వహణ చేస్తూ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా సైనికుల్లాగా ముందుకు సాగుతున్న పోలీసుల కృషి అభినందనీయమని, ప్రజా క్షేమం కోసం పనిచేస్తూ అమరులైన వారి త్యాగాలను స్మరించుకునేలా ప్రతి సంవత్సరం పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహిస్తున్నామని, అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రజలతో మరింత మమేకమై వారి మన్నలను పొందేలా విధులు నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని అన్నారు. రక్షణతో పాటు తన కుటుంబం కోసం హెల్మెట్ తప్పక ధరించాలని ట్రాఫిక్ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీతోపాటు అవినాష్ కుమార్ ఐపీఎస్, సిఐలు, ఆర్ఎస్ఐలు ,మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అమరవీరుల సంస్మరణలో బైక్ ర్యాలీ
As part of the Amar Veer Memorial Week, District SP Janaki Sharma led a bike rally to honor police sacrifices and promote public safety.
