మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ పట్టణానికి ట్రైని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు బృందం చేరుకుంది. వారికి మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ఘన స్వాగతం పలికారు. మున్సిపల్ కార్యాలయంలో ట్రైనింగ్ అధికారులను మున్సిపల్ చైర్మన్ ఘనంగా సన్మానం చేశారు. రామాయంపేట మున్సిపల్ పట్టణానికి చేరుకున్న ఆరుగురి ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బృందం నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. రామాయంపేటలోని అభివృద్ధి పనులను అదేవిధంగా బీటి రోడ్డు పనులను, అంగన్వాడి కేంద్రాలను, పశు వైద్యశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, డ్వాక్రా మహిళా బృందాలతో వారు భేటీకానున్నారు. మిషన్ భగీరథ మిషన్ కాకతీయ సంబంధించిన పనులను పరిశీలించనున్నారు. తెలంగాణ రెసిడెన్సి స్కూల్లో వారి సందర్శించారు. అదేవిధంగా గ్రామంలో పర్యటించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసినటువంటి పథకాలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ దేవేందర్ మాట్లాడుతూ… రామాయణంలో పర్యటించే ట్రైనింగ్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది అన్ని విధాలుగా సహకరిస్తుందని గ్రామంలో పర్యటించిన ట్రైన్ అధికారులు పూర్తి నివేదికను ప్రభుత్వo కు పంపించడం జరుగుతుందని వారు తెలిపారు. అనంతరం ట్రిని ఐఏఎస్ అధికారి రాం కిషన్ మాట్లాడుతూ… రామాయంపేట మున్సిపల్ పట్టణంలో మూడు రోజుల పాటు పర్యటించి, గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించడం జరుగుతుందని, మున్సిపల్ పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల, అంగన్వాడి కేంద్రలను, హాస్టల్లు, ప్రభుత్వ పాఠశాలను సందర్శించి వాటి యొక్క పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరుగుతుందని, పూర్తి నివేదికను జిల్లా అధికారులకు అందించడం జరుగుతుందని వారు తెలిపారు. ధర్మారం గ్రామంలో మూడు రోజుల పర్యటించడం జరిగిందని ప్రభుత్వ వైద్యశాల పనితీరు బాగుందని వైద్యుల పనితీరుపై గ్రామస్తులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారని గ్రామం కూడా బాగా అభివృద్ధి చెందిందని వారన్నారు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, కమిషనర్ దేవేందర్, మేనేజర్ శ్రీనివాస్, ట్రైనింగ్ ఐఏఎస్ , ఐపీఎస్, అధికారులు ముదిత్ కుమార్, రామ్ కిషన్, ప్రిన్స్ కుమార్, గౌరవ్ అగర్వాల్, వేణుగోపాల్, వసంతరావు, మున్సిపల్ కౌన్సిలర్ లు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు
మెదక్ జిల్లా రామాయంపేటకు ట్రైనింగ్ అధికారుల సందర్శన
A team of IAS and IPS training officers visits Ramayampet, where they are welcomed by Municipal Chairman Jitender Goud, to review development projects.
