సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి, పోలీస్ కమిషనర్ అనురాధ, పోలీస్ అధికారులతో కలసి మర్కుక్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. పోలీస్ స్టేషన్ చుట్టూ ఆవరణ, రిసెప్షన్, రైటర్ రూమ్, స్టాప్ రూమ్, లాకప్, తదితర ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్వెస్టిగేషన్ కిట్టు ను పరిశీలించారు. మర్కుక్ ఎస్ఐ దామోదర్ ఒక సీడీ ఫైల్ తీసి కలెక్టర్ కు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ గురించి వివరించారు. మర్కుక్ పోలీస్ స్టేషన్ అధికారులు సిబ్బంది ప్రతిరోజు జిమ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి మల్లారెడ్డి,గజ్వేల్ ఏ సీ పీ పురుషోత్తం రెడ్డి,గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి, మర్కుక్ ఎస్ ఐ దామోదర్,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మర్కుక్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కలెక్టర్ మను చౌదరి
