బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సుంకిడి అంతర్రాష్ట్ర రహదారిపై కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు, ఈ సందర్భంగా బోథ్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆడే గజేందర్ మాట్లాడుతూ గత పది ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతు సమస్యలు పట్టించుకోలేదని, ఎద్దేవా చేశారు, రైతు సమస్యలపై బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు, ఇలాంటి మాటలు తమ ప్రభుత్వంపై మరో మారు చేస్తే బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి చెప్తామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్ అడ్డీ బోజా రెడ్డి , తలమడుగు మాజీ జెడ్పిటిసి కోక గణేష్ రెడ్డి, తలమడుగు మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కల్యాణం రాజేశ్వర్, శ్రీధర్ రెడ్డి, కౌడాల నారాయణ, సంతోష్, సీనియర్ నాయకులు ప్రకాష్ రావు, వెంకటీ యాదవ్, రఫీక్, తదితరులు పాల్గొన్నారు.,
కేటీఆర్ పై కాంగ్రెస్ నిరసన, దిష్టిబొమ్మ దహనం
