చిన్న శంకరంపేటలో యువకుడి దారుణ హత్య

A youth was brutally murdered in the premises of a government hospital in Chinna Shankrampet, Medak district, prompting an investigation by local police. A youth was brutally murdered in the premises of a government hospital in Chinna Shankrampet, Medak district, prompting an investigation by local police.

మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో గుర్తు తెలియని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు ఉదయం ఆస్పత్రి ఆవరణలో ఓ శవం కాలిపోయి ఉందని స్థానిక వైద్యురాలు సాయి సింధు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్థానిక ఎస్సై నారాయణ గౌడ్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు, అనంతరం సి ఐ వెంకటరాజ గౌడ్ తూప్రాన్ డిఎస్పి వెంకటరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం ఆధారంగా వివరాలు సేకరించారు, డిఎస్పి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రి సిబ్బంది సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని శవాన్ని పరిశీలించడం జరిగిందని శవం పూర్తిగా కాలిపోయి ఉందని క్లూస్ టీం ఆధారంగా వివరాలు సేకరిస్తున్నామని అదేవిధంగా సిసి కెమెరాలు కూడా పరిశీలిస్తామని దాని ప్రకారం విచారణ చేపట్టి దోషులను పట్టుకుంటామని తెలిపారు, కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని మెదక్ ఏరియా హాస్పిటల్ కి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *