యలమంచిలి పట్టణంలో ధర్మారం, సిపి పేటకు చెందిన బంగారు వెంకి 20 సంవత్సరాలు వ్యక్తిపై మైనర్ బాలిక కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని డి.ఎస్.పి సత్యనారాయణ అన్నారు. డి.ఎస్.పి మాట్లాడుతూ యలమంచిలి పట్టణంలో ధర్మారం, సిపి పేటకు చెందిన బంగారు వెంకి 20 సంవత్సరాలు యలమంచిలి ఫైర్ ఆఫీస్ కాలనీకి చెందిన అమ్మాయితో వివాహం జరిగిందని అన్నారు. అమ్మాయికి ఒక పాప పుట్టడంతో వాళ్ల చెల్లిని సహాయం చేయడం కోసం వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వచ్చిందని తెలిపారు. వాళ్ళ అక్క నిద్రపోతుండగా మే నెలలో అర్ధరాత్రి సమయంలో, అలాగే జూన్ నెల వాళ్ళ అక్క లేని సమయంలో బయట పని చేసుకుంటూ ఉండగా పని ఉంది లోపలికి రమ్మని చెప్పి తలుపులు వేసి భయపెట్టి శారీరకంగా అనుభవించినట్లు తెలిపారు. అలాగే మైనర్ బాలిక వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సెప్టెంబర్ నెలలో ఒకసారి శారీరకంగా అనుభవించినట్లు వాళ్ళ అక్క మీద ఉన్న అభిమానంతో వాళ్ళ అక్కని ఎక్కడ హాని చేస్తాడని భయంతో చెప్పలేదని అన్నారు. ఎందుకు అలా ఉన్నావ్ అని వాళ్ళు తల్లిదండ్రులు అడగ్గా జరిగిన సంఘటన తెలిపిందని వారు పెద్దల సమక్షంలో చర్చించి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. దీనిపైన యలమంచిలి టౌన్ స్టేషన్ కేసు నమోదు చేయడం జరిగిందని అన్నారు.
యలమంచిలి పట్టణంలో కంప్లైంట్ ఇచ్చిన మైనర్ బాలిక
