అనకాపల్లి జిల్లా . ఎలమంచిలి నియోజకవర్గంలో , అచ్యుతాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అచ్చుతాపురం మరియు మునగపాక మండలాల తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల సమావేశం తెలుగుదేశం పార్టీ ఎలమంచిలి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ ప్రగడ నాగేశ్వరరావు గారి అధ్యక్షతన జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రగడ నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎలమంచిలి నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా ఉన్నదని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సభ్యత్వ నమోదు అత్యధిక స్థాయిలో జరగాలని, ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తను ఆదుకుంటామని, ఏ కార్యకర్తకి నష్టం వాటిల్లకుండా ఉమ్మడి ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ ఐకమత్యంతో కలిసి పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని, ఎలమంచిలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరింత ముందుకు వెళ్లాలని, ఈనెల 26వ తేదీ నుండి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం జరుగుతుందని, ఈ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు ప్రమాదవశాత్తు చనిపోయిన తర్వాత ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తారని, సాధారణ మరణం చెందిన కార్యకర్తకు మట్టి ఖర్చులుగా 10000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తారని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విద్యా వైద్య సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి శ్రీ కర్రీ సాయి కృష్ణ గారు, రాష్ట్ర కార్యదర్శి శ్రీ రాజాన రమేష్ కుమార్ గారు, మండల అధ్యక్షులు జనపరెడ్డి నర్సింగరావు, దొడ్డి శ్రీనివాసరావు, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆడారి మంజు, పీల తులసీరామ్, పొనమళ్ళ కొండబాబు,భీమరశెట్టి శ్రీనివాసరావు, మోల్లేటి సత్యనారాయణ, నీరుకొండ నర్సింగరావు, రాజాన నానాజీ, ఆడారి జానకి, కడియం అనురాధ, రేబాక మాలతి, సబ్బి శ్రీనివాసరావు, క్లస్టర్ ఇంచార్జిలు, యూనిట్ ఇన్చార్జులు, మండల నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ఐటీడీపీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.
అచ్యుతాపురంలో తెలుగుదేశం పార్టీ సమావేశం
