ఓదెల మండలంలోని రూపునారాయణపేట గ్రామంలో నూతనంగా హై లెవెల్ వంతెన నిర్మాణం కోసం ప్రభుత్వం నుండి 80 కోట్ల రూపాయలను మంజూరు చేయడంతో బ్రిజ్ నిర్మాణం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులతో,గ్రామస్తులతో మరియు సంబంధింత అధికారులతో కలిసి స్థలాన్ని పర్యవేక్షించిన అనంతరం గుంపుల గ్రామంలో అప్రోచ్మెంట్ బ్రిజ్ రోడ్డు గుంపుల నుండి తనుగుల, విలాసాగరం మరియు జమ్మికుంట వెళ్లే రహదారి పూర్తిగా ధ్వంసం కావడంతో కాంట్రాక్టర్లతో మరియు సంబంధిత శాఖ అధికారులతో కలిసి రోడ్డు ను పర్యవేక్షించి భూమి పూజ చేసి రోడ్డు పనులు ప్రారంభించిన గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు…
ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణా రావు గారు మాట్లాడుతూ…
గుంపుల అప్రోచ్మెంట్ రోడ్డు బ్రిజ్ నిర్మాణం ద్వారా ఓదెల, శ్రీరాంపూర్ మండలాలకు ముఖ ద్వారం ఉండే రోడ్డు ధ్వంసం కావడం వల్ల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతుందటంతో దాన్ని దృష్టిలో ఉంచుకొని రోడ్డు పనులు ప్రారంభించుకోవడం జరుగుతుందని సంబంధిత కాంట్రాక్టుర్ కూడా త్వరలోనే రోడ్డు పనులు పూర్తి చేస్తానని AE గారి సమక్షంలోనే చెప్పడం జరిగిందని ఓదెల,శ్రీరాంపూర్ మండలాల రైతులు,ప్రజలు తరుచూ జమ్మికుంట పట్టణానికి ప్రయాణం చేస్తారని వారు ఇబ్బందులు ఎదురుకుంటున్నారు.
రూపునారాయణపేట, పోత్కపల్లి, విలసాగరం, కోరపెల్లి,జమ్మికుంట వరకు ఈ బ్రిజ్ నిర్మాణం జరుగుతే మార్కెట్ కి వెళ్ళడానికి రైతులకు, ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది.. ప్రజల డిమాండ్ మేరకు ప్రభుత్వం నుండి మంజూరు చేపించడం జరిగింది. అదనంగా 20 నుండి 30 కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జిఓ నెంబర్ 801 ప్రభుత్వం నాన్ ప్లాన్ లో 80 కోట్ల రూపాయలతో మంజూరు ఇవ్వడం జరిగింది.. ఈ బ్రిజ్ మంజూరు కోసం సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారికి, ఆర్ & ఎన్,బి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారికి ఓదెల మండల ప్రజల పక్షాన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలియజేశారు.

 
				 
				
			 
				
			