ఉదయం ఆనంద్ బాగ్ లో పాల కోసం వెళ్లిన వ్యక్తి వద్ద నుండి అందరూ చూస్తుండగానే దర్జాగా పాకెట్ లో నుండి ఫోన్ కొట్టేసిన దుండగులు. ఈస్ట్ ఆనంద్ బాగ్ లోని మార్కెట్ కు వచ్చిన మరో వ్యక్తి వద్ద నుండీ మొబైల్ చోరీ. మొత్తం రెండు చోట్ల ఇద్దరు వ్యక్తుల వద్ద నుండి మొబైల్ ఫోన్లు కొట్టేసినట్లు తెలిసింది.
నీ డబ్బులు కింద పడ్డాయి అని చెప్పి ఆ వ్యక్తి దృష్టి మరల్చి జేబులో ఉన్న మొబైల్ ఫోన్లు చోరీ చేసారు. అప్పటికే బండి స్టార్ట్ చేసి ఉన్న ఇద్దరు యువకులు వెయిటింగ్ లో ఉండగా వారి బండి పై ఎక్కి నిందితుడు పరారైనట్లు బాధితుడు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.