సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో హైందవ సోదరుల ఆధ్వర్యంలో స్థానిక అంగడిపేట్ హనుమాన్ దేవాలయం నుండి ఇందిరాపార్క్ చౌరస్తామీదుగా అంబేద్కర్ విగ్రహం, వివేకానంద విగ్రహం వరకు చేరుకుని అక్కడి నుండి పోలీస్ స్టేషన్ వరకు భారీ ర్యాలీతో వెళ్లి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ దేవాలయం మీద దాడి చేసిన నిందితులను వారికి సహకరించిన వారిని శిక్షించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద హైందవ సోదరులు మాట్లాడుతూ హిందూ దేవాలయాల మీద హిందువుల మీద దాడి చేయడం హేయమైన చర్య అని ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హిందూ దేవాలయాల రక్షణకు భారీ నిరసన ర్యాలీ
 Mass Rally Demanding Protection of Hindu Temples
				Mass Rally Demanding Protection of Hindu Temples
			
 
				
			 
				
			 
				
			