మిక్కిలంపేటలో పల్లె పండుగ కార్యక్రమం

The Palle Panduga program was held in Mikkilampeta under the leadership of CM Nara Chandrababu Naidu and Deputy CM Pawan Kalyan. MLA Vemireddy Prashanthireddy inaugurated internal cement roads worth five lakhs. The Palle Panduga program was held in Mikkilampeta under the leadership of CM Nara Chandrababu Naidu and Deputy CM Pawan Kalyan. MLA Vemireddy Prashanthireddy inaugurated internal cement roads worth five lakhs.

కొడవలూరు మండలం మిక్కిలంపేట గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలో రాష్ట ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని మిక్కిలంపేట గ్రామంలో ఐదు లక్షలతో అంతర్గత సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన చేసారు .ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎంయల్ఏ కి స్థానిక నాయకులు హారతులు పట్టి ఘనస్వాగతం పలికారు .

ఈ సందర్భంగా ఎంయల్ఏ మాట్లాడుతూ ,ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కృషిచేస్తున్నారని ,రాబోయే రోజుల్లో ఒక్కొక్కటిగా ప్రతి హామీ నిరవేర్చడం జరుగుతుందని అన్నారు .

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కోటంరెడ్డి అమరేందర్ రెడ్డి, సర్పంచ్ కోడూరు చంద్రశేఖర్ రెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షులు కోడూరు వెంకట సుధాకర్ రెడ్డి, మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి ,ఎంపీటీసీ గరికిపాటి రాజా, కరకటి మల్లికార్జున ,బీజేపీ, టీడీపీ ,జనసేన నాయకులు కార్యకర్తలు మండల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *