అరకు వేలి నియోజకవర్గము కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా మిత్రులకు ఒక ప్రకటన విడుదల చేసిన ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాచిపెంట చిన్నస్వామి! తేదీ 23.10.2024న ఉదయం 10 గంటలకు అరకు వేలి అంజలి రెసిడెన్సి ప్రాంగణము వద్ద ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ శ్రీమతి పాచి పెంట శాంత కుమారి ఆధ్వర్యంలో అరకు వేలినియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బలోపేతం.కోసం విస్తృత స్థాయి మరియు గిరిజన హక్కులు చట్టాల కోసం ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది .
ఈ సందర్భంగా పాచిపెంట చిన్న స్వామి మాట్లాడుతూ ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర చైర్ పర్సన్ గౌరవ శ్రీ రిమాలినవభారత్ మరియు అల్లూరి సీతారామరాజు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవ శ్రీ సతక బుల్లిబాబు విచ్చేయుచున్నారు కావున 2024 కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీ కి.పోటీ చేసిన అభ్యర్థి. మరియు ఆశహావులు గతంలో జెడ్పిటిసిగా ఎంపీటీసీలుగా సర్పంచులు గా వార్డు మెంబర్లుగా పోటీ చేసి ఉన్న అభ్యర్థులు అరకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులుమండల అధ్యక్షులు నాయకులు మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ నాయకులుమరియు కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల నాయకులు కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయగలరని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ ప్రేమ పూర్వకంగా స్వాగతం పలుకుచున్నాము
ఈ కార్యక్రమంలో ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తెలగంజి సోమేశ్వరరావు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పాంగి గంగాధర్ మండల ప్రధాన కార్యదర్శి శెట్టి భగత్ రాం నాయకులు సమరెడ్డి బంగార్రాజు శెట్టి రామచంద్ర రావు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
