నిజాంపేట మండల కేంద్రంతోపాటు నస్కల్ రాంపూర్ గ్రామాలలో సొసైటీ ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వడ్ల కొనుగోలు కేంద్రాలను శుక్రవారం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా 473 కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామన్నారు. ప్రజలకు ఎన్నికలలో ఇచ్చిన హామీని రైతులకు 500 బోనస్ అందజేస్తామని తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పడి చేసినటువంటి కొనుగోలు కేంద్రాల వద్దనే ధాన్యం విక్రయించాలన్నారు. అనంతరం రాంపూర్ గ్రామంలో గౌడ కులస్తులకు కాటమయ్య రక్ష కవచాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మండలం ఎంపీపీ దేశెట్టిసిద్ధరాములు, వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, రామాయంపేట ఎక్సైజ్ సిఐ రాణి, ఎస్సై విజయ్ సిద్ధార్థ,సొసైటీ చైర్మన్ లు బాపురెడ్డి,బాజా చంద్రం, మాజీ సర్పంచ్ అమరసేనారెడ్డి,మండల అధ్యక్షులు మారుతి,నసీరుద్దీన్,వెంకటేష్ గౌడ్, సుప్రభాత రావు,లక్ష్మణ్ గౌడ్, రామచంద్ర గౌడ్, వెంకటేష్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.
నస్కల్ రాంపూర్‌లో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
 Medak MLA Mainampally Rohith Rao inaugurated paddy purchase centers in Naskal Rampur, promising 500 bonus to farmers and urging them to sell directly to the government.
				Medak MLA Mainampally Rohith Rao inaugurated paddy purchase centers in Naskal Rampur, promising 500 bonus to farmers and urging them to sell directly to the government.
			
 
				
			 
				
			