నాగోలోనీ సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. కేటీఆర్ మాట్లాడుతూ LB నగర్ ఎంఎల్ఏ మిగితా ఎమ్మెల్యే లు , మా కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్లు ఉన్నారు మా డివిజన్ అధ్యక్షులు ఉన్నారు వాళ్ళకి ఏమైనా ఉంటే కంప్లయింట్ ఇవ్వండి మీ తరఫున న్యాయపరంగా చట్టపరంగా రాజ్యాంగపరంగా కొట్లడుతారని, మీకు న్యాయం చేసే బాధ్యత మాది ఎస్టిపిల గురించి కూడా మొత్తం నగరంలో ప్రజలందరికీ తెలవాలి 1200 S T P కట్టింది కేసీఆర్ ప్రభుత్వం .మూసిలో శుద్ధమైన నీళ్లు ఇవాళ ఇలా వస్తున్నాయంటే దానికి కారణం కేసీఆర్ ప్రభుత్వం గోదావరి నీళ్ళని ఇలా తీసుకొచ్చి మూసిలో కలిపే అవకాశం వచ్చింది. అంటే దానికి కారణం కేసీఆర్ పూర్తిచేసిన కాలేశ్వరం ఆ కాలేశ్వరం నీళ్లతోనే హైదరాబాద్కు మంచినీళ్లు వస్తున్నాయి.
అదే విధంగా రేపటి మూసిలో కూడా స్వచ్ఛమైన నీళ్లు వస్తాయి అనే మాట కూడా మీరందరూ తెలుసుకోవాలి పదిమందికి చెప్పాలి ఈ దోపిడీ పాలనకు మూసి పేరిట జరుగుతున్న లూటీకి చర్మ గీతం పాడాలి కచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి .ఎందుకు చేస్తున్నావు అని సవాల్ చేయాలని చెప్పడం జరిగింది. అలాగే తులం బంగారం కు పైసల్లేవ్ పేదవాడికి పెన్షన్ 2000 నుంచి 4000 చేస్తా, అన్నావ్ 100 రోజుల్లో చేస్తా అన్ని పతకాలు అమలు చేస్తా అన్నావ్. రైతు బంధు అని రైతులకు కొర్వీలు పెట్టి రైతులందరినీ మోసం చేస్తున్నావు ,రైతులు కూడా తిట్టుకున్నారు.
మనం మూసి బ్యూటిఫికేషన్ కు వ్యతిరేకం కాదు కానీ మూసిలో జరిగే లుటిఫికేషన్ కు మాత్రo వ్యతిరేకం .ఇక్కడ జరిగే మూటల దోపిడీకి వ్యతిరేకం అందులో డౌట్ లేదు. నరేంద్ర మోడీ గారు గంగా ప్రక్షాళన కోసం మంచి పని కి గంగానది మొత్తం 2400 కిలోమీటర్ల కోసం 40,000 కోట్లు సరిపోతాయని చెప్తుంటే ఇక్కడ మాత్రం లక్షన్నర కోట్లు ఖర్చు పెడతా అంటుండు. అక్కడేమో కిలోమీటర్లు 17 కోట్లు ఖర్చు అయితుంటే, ఇక్కడ కిలోమీటర్లు 2700 కోట్లు ఖర్చు అయితదంట. ఎట్లా చెప్పాలి ఈ ప్రభుత్వానికి, ప్రజల సొమ్ము ఇంత దారుణంగా దోచుకుంటున్నారో ప్రజలు చూస్తున్నారు. వారికి అన్ని అర్థం అవుతున్నాయ్ అని సమావేశంలో తెలపడం జరిగింది.
ఎమ్మెల్యేలు సుదీర్ రెడ్డి మహ్ముద్ ఆలీ , సబిత ఇంద్రరెడ్డి, వివేకానంద కాలేరు వెంకటేశ్ , ముఠా గోపాల్ ,, లక్ష్మా రెడ్డి , మాధవరం కృష్ణారావు ,మరియు కార్పొరేటర్లు,ఎక్స్ కార్పొరేటర్లు,స్థానిక నాయకులు పాల్గొన్నారు.

 
				 
				
			 
				
			