కామారెడ్డి పట్టణంలోని పశ్చిమ హౌసింగ్ బోర్డు కాలనీ లోని గ్రామ దేవతలైన పోచమ్మ దేవాలయంలోకి నిన్న అర్ద రాత్రి గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి ఆలయంలో గుర్తు తెలియని దుండగులు బీభత్సవం సృష్టించి పోచమ్మ , ముత్యాలమ్మ , లక్ష్మమ్మ అమ్మవారి విగ్రహాలు అపహారించడం జరిగింది , వేద పండితుల సమక్షంలో హిందూ దర్మ సాంప్రదాయ పద్దతిలో శాస్త్రోప్తేతంగా ప్రతిష్టించిన అమ్మవారి విగ్రహాలతో పాటు ఆలయంలోని విలువైన వస్తువులను ఎత్తుకెళ్లడమే కాకుండా ఆలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది.
విషయం తెలుసుకున్న హౌసింగ్ బోర్డు కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు , కాలనీ వాసులు , ఆలయ పండితులు మరియు హిందూ దార్మిక సంఘాలు , రాష్ట్ర ఆర్యక్షత్రియ సంఘం అధ్యక్షులు నిట్టు వేణుగోపాల్ రావు ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణ సి ఐ చంద్రశేఖర్ రెడ్డి కి మెమోరాండం సమర్పించి దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించి 2-3 రోజుల్లో అమ్మ వారి విగ్రహాలను అప్పగించి మా హిందూ మనోభావాలు కాపాడాలని కోరడం జరిగింది , లేని పక్షంలో కామారెడ్డి పట్టణంలోని అన్ని కుల సంఘాలు , వ్యాపార వాణిజ్య సంఘాలు , మరియు హిందూ దార్మిక సంఘాలతో సమావేశం అయ్యి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మంచి రవి , ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ నాయక్ , వార్డు కౌన్సిలర్ నిట్టు కృష్ణమోహన్ రావు , ముప్పారపు ఆనంద్ , నిట్టు వెంకట్ రావు , మదాం నవీన్ , చింతల రమేష్ , అసోసియేషన్ ప్రతినిధులు అంజయ్య , సాయిలు , సిద్దిరామ గౌడ్ , నాగేశ్వర్ రావు , ఆకుల నారాయణ , అసోసియేషన్ ప్రతినిధులు , ఆలయ పండితులు , కాలనీ వాసులు మరియు హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

 
				 
				
			 
				
			