రంపచోడవరం ఏజెన్సీలోని గిరిజనులు వాల్మీకి రామాయణాన్ని అవగాహన చేసుకుని రానున్న తరాల వారికి తెలియజేసే బాధ్యత ప్రతి పౌరుడు పై ఉందని రంపచోడవరం శాసన సభ్యురాలు శ్రీమతి మిరియాల శిరీష దేవి పేర్కొన్నారు. గురువారం స్థానిక వాల్మీకి పేటలోని వాల్మీకి జయంతి పురస్కరించుకొని ముఖ్య అతిథులుగా రంపచోడవరం శాసన సభ్యురాలు శ్రీమతి మిరియాల శిరీష దేవి, మాజీ శాసనసభ్యులు సీత శెట్టి వెంకటేశ్వరరావు. జిల్లా వాల్మీకి సంఘ అధ్యక్షులు గొర్లె చిన్న నారాయణరావు. హాజరై వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రంపచోడవరం శాసనసభ్యులు శ్రీమతి మిరియాల శిరీష దేవి మాట్లాడుతూ ప్రపంచంలోనే మొట్టమొదటి ఆదివాసి వాల్మీకి మహర్షి అని అదేవిధంగా వాల్మీకి మహర్షి రాసిన రామాయణాన్ని అందరూ చదివి రానున్న తరాల వారికి తెలియజేసే బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. రాముడు దేవుడు అని ప్రపంచానికి చాటి చెప్పిన ఒకే ఒక గ్రంథం వాల్మీకి రామాయణం అని అన్నారు.
వాల్మీకి రామాయణంలో పెద్దలను. తల్లిదండ్రులను. గురువులను. ఇతరులను ఈ విధంగా గౌరవించాలో రామాయణంలోని క్షుణ్ణముగా రాయబడి ఉన్నాయని ఆమె అన్నారు. వాల్మీకి రామాయణం తో పాటు ఏజెన్సీలోని గిరిజనులందరూ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకుంటూ గిరిజనులంతా కలిసిమెలిసి ఉండి గిరిజన ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆమె అన్నారు. మాజీ శాసనసభ్యులు సీతంశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రామాయణం అనేది ప్రపంచంలోనే గొప్ప కావ్యము అని ఆయన అన్నారు. రాముడు దేవుడు అని అదేవిధంగా వాల్మీకి ఆశ్రమంలో సీతమ్మ తల్లి లవకుశలను జన్మనిచ్చారని ఆయన అన్నారు.
వాల్మీకి లవకుశ లకు మంచి మంచి విద్యలను వాల్మీకి నేర్పించడం జరిగిందని ఆయన అన్నారు. ప్రతి వ్యక్తి రామాయణాన్ని చదివి రానున్న తరాల వారికి రామాయణంలో పొందుపరిచిన విషయాలని తెలియజేయాలని ఆయన అన్నారు. వాల్మీకి ఆశ్రమంలో లవ కుశలు వాల్మీకి మహర్షికి భగవాన్ అనే వారిని రామాయణంలో తెలియజేయడం జరిగిందని ఆయన అన్నారు. వాల్మీకి జిల్లా అధ్యక్షులు గొర్లే చిన్న నారాయణరావు మాట్లాడుతూ వాల్మీకి జయంతి జరుపుకోవడం మా పూర్వజన్మ సుకృతమని ఆయన అన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆదివాసి వాల్మీకి మహర్షి వారని ఆయన అన్నారు.
వాల్మీకి రామాయణం వ్రాయటం అంత సులువు కాదని అదేవిధంగా భగవంతుడు ఆశీస్సులతో వాల్మీకి రామాయణ గ్రంథం వాల్మీకి మహర్షి వారు రాయడం జరిగిందని ఆయన అన్నారు. ఈరోజు వాల్మీకి జయంతిని పురస్కరించుకొని ఈ ఏర్పాట్లు చేసినటువంటి వై.నిరంజనీ దేవికి,గొర్లె భవాని శంకర్ కి,వై.భూ చక్రానికి, గొర్లె రమాదేవికి, గొర్లె శ్రీరామ్ చందు వాల్మీకి కి, గొర్లె మోహన్ చంద్ వాల్మీకి కి, గొర్లె సత్యనారాయణకి అందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మారేడుమిల్లి జెడ్పిటిసి గొర్ల బాలాజీ బాబు, కారం సురేష్, ఆదివాసి ఐక్యవేదిక అధ్యక్షులు వెదుళ్ళ లచ్చిరెడ్డి, మడిగుంట వెంకటేశ్వరరావు, వై. ప్రశాంత్ కుమార్, విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు కిషోర్, కర్రీ. రామారెడ్డి,బొంకు. సతీష్ బాబు,వై. కావ్య, గెచ్చా ఆనంద్. గుడ్ల శ్రీనివాసరావు, పసుపులేటి ప్రియ బాబు. వీరవత్తుల జ్ఞానేందర్, దాసరి సుబ్రహ్మణ్యం, దాసరి. మణి,దాసరి అయ్యప్ప, అప్పారావు. బొర్రు. భూషణం, నీలాపు సురేష్,తదితరులు పాల్గొన్నారు
