అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం లకొండ సచివాలయాన్ని సందర్శించిన రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవి , తెలుగు యువత అధ్యక్షులు విజయభాస్కర్ లాక్కొండ సచివాలయాన్ని సందర్శించి సిబ్బంది హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలను ప్రజలకు అందించాలని, కొత్తగా వచ్చే పింఛన్ అప్లికేషన్ తీసుకొని వచ్చే జనవరి కెల్లా కొత్తవారికి పింఛన్ అందించే విధంగా ఉండాలని సచివాలయ సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు. లక్కొండ సచివాలయ భవనాన్ని త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. సచివాలయంలో ఉన్న సమస్యలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గంగవరం జనసేన పార్టీ మండల అధ్యక్షులు కుంజం సిద్దు, ఉపాధ్యక్షులు గవరాజు, సచివాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సచివాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే శిరీష దేవి
MLA Shireesha Devi emphasizes timely pension distribution and reviews issues at Lakonda Secretariat in Rampachodavaram constituency.
