పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ రవీంద్ర హెరాయిస్ లో కోటి 15 లక్షలు విలువచేసే పల్లాడియం మెటల్ పౌడర్ దొంగతనం కేసును చేదించిన పోలీసులు…
ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, ఈ నెల 12వ తేదీన మెటల్ పౌడర్ దొంగతనం జరిగినట్టు కంపెనీ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు పై విచారణ చేపట్టామని,
అదే కంపెనీలో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులు దొంగతనానికి పాల్పడినట్టు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.
వారి నుండి కోటి 15 లక్షలు విలువచేసే పల్లాడిఎం మెటల్ పౌడర్ స్వాధీనం చేసుకొని నిందతులను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు.
ఈ సందర్భంగా రెండు రోజుల్లోనే కేసును చేదించిన పరవాడ పోలీసులకు జిల్లా ఎస్పీ దీపిక పాటిల్ ప్రశంశా పత్రాన్ని ఇచ్చి అభినందించారు.
పార్వాడ ఫార్మాసిటీ మెటల్ పౌడర్ దొంగతనం చేదించిన పోలీసులు
