పాత పెన్నా బ్రిడ్జి, బోడిగాని తోట వద్ద పడిన గండి మరియు పోట్టేపాలెం కలుజును కలెక్టర్ గారితో కలిసి పరిశీలించిన జిల్లా యస్.పి. శ్రీ జి. కృష్ణకాంత్,IPS., గారు రానున్న 48 గంటలలో భారీ వర్ష సూచన మరియు జిల్లాలో కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకొని, ఈ రోజు మధ్యాహ్నం జిల్లా కలెక్టర్, యస్.పి. గార్లు పాత పెన్నా బ్రిడ్జి, బోడిగాని తోట వద్ద పడిన గండి పరిశీలించి R&B, NH డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ మరియు కాంట్రాక్టర్ లకు తగు సూచనలు ఇవ్వడం జరిగింది.
ఈ క్రమంలో అక్కడ ఉన్న బోడిగాని తోట కుటుంబాలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా యస్.పి. గారు మీడియాతో మాట్లాడుతూ రానున్న 24 గంటల నుండి 48 గంటల వరకు భారీ వర్ష సూచనలకు అనుగుణంగా జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి సన్నద్ధంగా ఉందని తెలిపారు.
ఈ క్రమంలో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలలో ఉన్న సుమారు 100 కుటుంబాలను రెవిన్యూ మరియు ఇతర శాఖల సమన్వయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. అదేవిధంగా పెన్నా పరివాహక మరియు తీర ప్రాంత ప్రజలను పరిస్థితులను బట్టి అప్రమత్తతో పాటు, తరలింపుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు.
భారీ వర్షాల కారణంగా సమస్యలు తలెత్తినపుడు వాటిని వెంటనే అధికారుల దృష్టికి తీసుకోవచ్చే విషయంలో మీడియా సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరారు.
అనంతరం కలెక్టర్ గారితో కలిసి యస్.పి. గారు పోట్టేపాలెం కలుజును చేరుకొని అక్కడ రూరల్ DSP గారితో, ఒకవేళ వరద పరిస్థితులు తలెత్తితే తీసుకోవాల్సిన ముందస్తు చర్యల గురించి పలు సూచనలు చేసారు.
24×7 అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, భారీ వర్షాలు, వరదల వలన ఏమైనా ఘటనలు తలెత్తినా, అత్యవసర పరిస్థితి వచ్చినా, సమస్యలకు గురైనా ప్రజలు, వెంటనే డయల్ – 112 లేదా పోలీసు కంట్రోల్ రూమ్ వాట్సాప్ నంబర్ 9392903413 కు మరియు కలెక్టరేట్ నందు ఏర్పాటు చేయబడిన కంట్రోల్ రూమ్ వాట్స్ యాప్ నంబర్ 9440796370 నకు సమాచారం తెలపాలని ఈ సందర్భంగా యస్.పి. గారు మరోసారి సూచించారు.

 
				 
				
			 
				
			 
				
			