కూటమి ప్రభుత్వం తోనే గ్రామాల్లో అభివృద్ధి చెందుతాయని మాజీ జడ్పిటిసి కరక సత్యనారాయణ చెప్పారు.
మండలంలో మూడవరోజు పల్లి పండగ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలో ఎం బెన్నవరం జిల్లేడుపూడి గాంధీనగరం శృంగవరం ఏపీ పురం గ్రామాల్లో పలు సిసి రోడ్లకు డ్రైనేజీలకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాజీ జడ్పిటిసి కరక సత్యనారాయణ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలలో గత ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిపై దృష్టి సాధించకపోవడంతో అధ్వానంగా తయారయ్యాయని అన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలల్లోనే గ్రామాల అభివృద్ధిపై దృష్టి సాధించిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ లు సింగంపల్లి సన్యాసి దేముడు పారుపల్లి కొండబాబు నేతల విజయ్ కుమార్ మండల టిడిపి పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ గ్రామ మాజీ సర్పంచ్ రత్న కుమారి బిజెపి నాయకులు లాలం వెంకట రమణారావు టిడిపి నాయకులు బాల నాయుడు గ్రామస్తులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

 
				
			 
				
			 
				
			 
				
			