జిల్లాలో మూడురోజులపాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్దంగా ఉందని మంత్రి నారాయణ తెలిపారు.. అల్పపీడనం తుపానుగా మారితే ఈ నెల 17న తీరం దాటొచ్చని వాతావరణ శాఖ తెలిపిందన్నారు. సీఎం చంద్రబాబు కీలక సలహాలు, సూచనలు ఇచ్చారని.. భారీ వర్షసూచన నేపధ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేశామన్నారు.. కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించి.. అనంతరం మీడియాతో మాట్లాడారు.. మున్సిపల్ కమిషనర్లు అందరికీ వెంటనే సిల్టు తీయాలని, బాటిల్ నెక్స్ క్లీన్ చేయమని ఆదేశాలిచ్చామన్నారు.. ఏ ఒక్కరి ప్రాణనష్టం జరగకూడదని సీఎం చంద్రబాబు ఆదేశించారని.. లో లైన్ లో నివాసం ఉండేవారిని వెంటనే పునరావస కేంద్రాలకి తరలించే ఏర్పాటు చేశాంమని వెల్లడించారు.. వాటర్ ట్యాంకులు, జనరేటర్లు, ఎక్సకవేటర్లు, ట్రాక్టర్లని ముందుగా ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఆహారం, తాగునీరు వెంటనే అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కమాండ్ కంట్రోల్ రూమ్స్ కి విజయవాడ నుంచి ఆదేశాలిస్తున్నామని తెలిపారు.. కలెక్టర్లు, అధికారులు లోతట్టు ప్రాంతాల్లో వారిని ఖాళీచేయమని సూచిస్తే, ప్రజలు సహకరించాలని విజ్ణప్తి చేశారు.
జిల్లా యంత్రాంగం విపత్కర పరిస్థితులకు సిద్ధం
 District Machinery Prepared for Emergency Situations
				District Machinery Prepared for Emergency Situations
			
 
				
			 
				
			 
				
			