శ్రీ పైడితల్లి అమ్మవారిని పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు మంగళవారం ఉదయం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కేంద్ర మాజీ మంత్రి, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ పూజారులు, అధికారులు అధికార లాంచనాలతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ చక్రవర్తి, ఇతర న్యాయమూర్తులు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వారికి పైతల్లి అమ్మవారి చిత్రపటాలను, ప్రసాదాన్ని అందజేశారు.
రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డి వి జి శంకర్రావు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ కుటుంబ సమేతంగా అమ్మవారిని సందర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు అధికారికంగా స్వాగతం పలికి అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు.
పూసపాటి రాజ కుటుంబీకులు సుధాగజపతి ఇతర కుటుంబ సభ్యులు అమ్మవారిని సందర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు.
మాజీ శాసనసభ్యులు బడ్డుకొండ అప్పలనాయుడు కుటుంబ సమేతంగా అమ్మవారి సందర్శించుకుని పూజలు నిర్వహించారు.
