జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం చిన్న పోతులపాడు గ్రామంలో బతుకుతెరువు కోసం బజ్జీల బండి నడుపుకుంటున్నటువంటి దళిత ప్రశాంతి అలియాస్ ఎస్తేరమ్మ మీద అదే గ్రామానికి చెందిన చాకలి యుగేందర్ చాకలి సతీష్ వాళ్ళ తల్లి అరుణ కలిసి కులం పేరుతో అసభ్య పదజాలం ఉపయోగించి బజ్జీల బండి తీసేయ్ అని దౌర్జన్యంగా బజ్జీల కొరకు పెట్టి ఉన్న సలసల కాగుతున్న వేడి నూనెను ప్రశాంతి పైన చల్లడం జరిగింది .
ఒక ఆడపిల్లని కూడా చూడకుండా ప్రశాంతి ఒళ్లంతా వేడి నూనెతో కాలిపోవడం జరిగింది ఇంతటి దౌర్జన్య సంఘటన జరిగినప్పటికీ మానవపాడు స్థానిక ఎస్సై ఆ గ్రామం లోకి వచ్చి నిందితుల ఇంట్లోకి వెళ్లి కూర్చున్నాడే గాని ఒంటిపై నూనెతో కాలిపోయినటువంటి బాధితురాలు ను కనీసం పలకరించడం కూడా చేయలేదు.. దాడి చేసిన దుండగులపై ఏట్లాంటి చర్యలు తీసుకోలేదు కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. అని బాధితులు వాపోయారు మరసటి రోజు గ్రామ మహిళలంతా కలిసి పోలీస్ స్టేషన్ కి వెళితే ఉదయం 10 గంటల నుండి రాత్రి పది గంటలు దాకా వేచి చూసిన తర్వాత వచ్చినటువంటి ఎస్సై ఈ దాడి పైన నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరిగింది.
బాధితురాలు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నది ఈరోజు కుల నిర్మల పోరాట సమితి గద్వాల జిల్లా అధ్యక్షులు హిమాద్రి రవికుమార్ సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ ప్రేమ్ కుమార్ బాధితురాలిని పరామర్శించి బాధితురాలు తో పాటు అక్కడ ఉన్నటువంటి గ్రామ మహిళలతో సంఘటన సంబంధించిన వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా దళిత ప్రశాంతికి న్యాయం జరిగేదాకా పోరాడుదామని దాడి చేసిన దుండగులు యుగంధర్ సతీష్ లను వెంటనే అరెస్టు చేయాలని ఈ సంఘటన పట్ల పోలీసులు కూడా నిర్లక్ష్యం వహించకుండా తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము.
