భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో 36.5 కోట్లతో నిర్మించిన 2.5 మెగావాట్ల పవర్ ప్లాంట్ ను శనివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ
1986 లో ఎన్టీఆర్ పెదవేగి లో మొక్క నాటారని,అది ఇప్పుడు వేల ఎకరాలు విస్తరించిందని అన్నారు.1990 తర్వాత తెలంగాణ లో పామాయిల్ సాగు చేసే రైతులకు టన్ను ఇరవైవేలు ధర ఉండేలా దృష్టి పెడతామని
అవసరమైతే ఇరు రాష్ట్రాల అధినేతలతో కలిసి కేంద్రం దగ్గరకి వెళతామని అన్నారు.పామాయిల్ టన్ను ధర
వచ్చే నెలలో మరో 13 వందలు పెరుగుతుందని
రాహుల్ గాంధీ సారథ్యంలో 20 వేలు కంటే ఎక్కువ వచ్చేలా ప్రణాళిక చేస్తున్నామని తెలిపారు.
కొత్తగూడెం జిల్లాలో పట్టా ట్రాన్ఫర్ లు ఉండవు గనుక భూమి ఉన్న ప్రతి రైతుకు పామాయిల్ మొక్క అందేలా రెవెన్యూ మంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు.ఆంధ్రాలో నర్సరీలకు విద్యుత్ పరంగా ఉన్న విధి విధానాలు అశ్వారావుపేట నర్సరీలకు ఇవ్వాలని విద్యుత్ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు.రైతులు కోరుకుంటున్న ప్రకారం రైతు భరోసా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నామని,తల తాకట్టు పెట్టి అయినా పంట భీమా పధకం ఇప్పిస్తామని అన్నారు.సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని
డిసెంబర్ 9 లోపు అర్హులైన రైతులందరికీ రుణమాఫీ పూర్తి చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు.

 
				 
				
			 
				
			