గడ్డం శ్రీదేవి ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబురాలు ఈ వేడుకలలో తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో భగత్ సింగ్ నగర్ కట్ట మీద ఎల్లమ్మ గుడి ప్రాంగణంలో స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మలకు పూజలు నిర్వహించి వేడుకలు ప్రారంభించారు.బతుకమ్మల చుట్టూ బతుకమ్మ పాటలకు కోలాటం చేస్తూ ఉత్సహాంగా నృత్యాలతో సందడి చేశారు. ఈ వేడుకలలో పాల్గొన్న మహిళలకు పులిహోర ప్రసాదాలు చల్లటి పనియాలు ,మంచినీరు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా గడ్డం శ్రీదేవి మాట్లాడుతూ తెలంగాణలో బతుకమ్మకు ఘనమైన చరిత్ర ఉందని, ఆడపడుచులకు ఎంతో పీతిపాత్రమైన పండుగని పేర్కొన్నారు. ఎల్లమ్మ గుడి ప్రాంగణంలో ఏడు రోజులపాటు బతుకమ్మ ఉత్సవాలను ఆనందోత్సాహాలతో నిర్వహించుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ నగర్ కాలనీ వాసులకు, ఆడపడుచులందరికి సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, అంతా మంచే జరుగాలని ఆమే అకాంక్షించారు.
ఈ వేడుకల్లో సత్యమ్మ,యాదమ్మ,స్వరూప,దివ్య,సంధ్య రాణి,సంధ్య, అరుణ, సుగుణ,నాగరాణి, స్వాతి, ఉమా విజయ,శాంతమ్మ, గీత,విమల,వాణి,సంధ్య,వైష్ణవి, మేఘన, చుక్రు,అఖిల, పొట్టి, గనిష్క, లక్కీ,చిన్నారుల పాల్గొన్నారు.