గంగవరం దసరా ఉత్సవాల్లో మహిషాసురమర్దిని దర్శనం

Sri Rajarajeshwari Devi, in Mahishasura Mardini avatar, blessed devotees during Dasara Navaratri in Gangavaram. Devotees offered prayers with devotion. Sri Rajarajeshwari Devi, in Mahishasura Mardini avatar, blessed devotees during Dasara Navaratri in Gangavaram. Devotees offered prayers with devotion.

అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం లో దసరా నవరాత్రుల్లో భాగంగా మహిషాసుర మర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు.
దీనిలో భాగంగా గంగవరం మధ్య వీధిలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మళ్ళ నాగేశ్వరరావు దంపతులచే పూజాది కార్యక్రమాలు, శాంతి హోమం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారి నవరాత్రి రూపాల ను విశిష్టతను భక్తులకు సవినయంగా వివరించారు .
ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *