కాట్రియాలలో మంత్రాల పేరుతో దారుణ హత్య

In a shocking incident in Medak district, six individuals were arrested for the brutal murder of Dhyagala Muttavva, accused of practicing sorcery, reflecting the dangers of superstitions in rural areas. In a shocking incident in Medak district, six individuals were arrested for the brutal murder of Dhyagala Muttavva, accused of practicing sorcery, reflecting the dangers of superstitions in rural areas.

మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో మంత్రాలు చేస్తుందని నెపంతో అదే గ్రామానికి చెందిన ధ్యాగల ముత్తవ్వను అతి దారుణంగా కట్టెలతో కొట్టి చంపి, పెట్రోల్ పోసి హత్య చేసిన ఆరుగురిని శనివారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అరెస్టు అయిన వారిలో ద్యాగల మురళి, ధ్యాగల రామస్వామి, ద్యాగల శేఖర్, ధ్యాకల రాజలత, ద్యాగల లక్ష్మి, ధ్యాగల పోచమ్మ, లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సిఐ వెంకట రాజా గౌడ్ మాట్లాడుతూ ద్యాగల ముత్తవ్వ అనే మహిళ అదే గ్రామానికి చెందిన మరో మహిళకు బాణామతి చేయడం వల్ల ద్యాగల పోచమ్మ ఆరోగ్యంగా బాగా లేకపోవడంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుందని మూడవ తేదీ నాడు రాత్రి 8:30 గంటల నుండి ఏడుగురు వచ్చి ముత్తవ్వ ఇంటికి వెళ్లి ఆమెను కట్టెలతో తలపై కొట్టగా తల పగిలిందని ఆయన తెలిపారు. తల పగిలి అప్పటికే ఆమె మృత్యువాత పడిందన్నారు. వెంటనే పెట్రోల్ పోసి ముత్తవను తగుల పెట్టినట్లు తెలిపారు. మూఢనమ్మకాలు గ్రామాలలో నమ్మవద్దని ఎవరైనా ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సి ఐ వెంకట రాజా గౌడ్ తో పాటు రామాయంపేట ఎస్సై బాలరాజు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *