కామారెడ్డి జిల్లా కేంద్రంలోని PJR , స్ఫూర్తి జూనియర్ కళాశాలలో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియ హాజరై మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు అత్యంత ఇష్టమైన పండుగ అంటే బతకమ్మ పండగ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పండుగలు వస్తాయి కానీ ఆడవారికి మాత్రం, ఆడ పిల్లలకు మాత్రం ఇష్టమైన పండుగ అంటే మాత్రం బతుకమ్మ పండుగ అన్నారు. విద్యార్థులు బతుకమ్మ పండగ సందర్భంగా వివిధ పూల రంగుల పువ్వులతో బతుకమ్మలు పేర్చడం జరిగిందని వారికి కళాశాల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో PJR జూనియర్ కళాశాల ఉపాధ్యాయులు , స్ఫూర్తి జూనియర్ కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

 
				
			 
				
			 
				
			