సోమనపల్లిలో అంబేద్కర్ యువజన సంఘం కమిటీ ఎన్నుకోండి

The All India Ambedkar Youth Association has formed a new committee in Somnapalli village to promote Dr. Ambedkar's ideals, with key members elected during a recent meeting. The All India Ambedkar Youth Association has formed a new committee in Somnapalli village to promote Dr. Ambedkar's ideals, with key members elected during a recent meeting.

ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సోమనపల్లి గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. ఆదివారం సోమనపల్లి గ్రామంలోని కమ్యూనిటీ హాల్ లో నిర్వహించిన సమావేశంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపెల్లి బాపయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను గ్రామ గ్రామాన తీసుకెళ్లేందుకు అంబేద్కర్ యువజన సంఘం కమిటీ లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఉప్పులేటి కుమారస్వామి, ఉపాధ్యక్షులుగా ఉప్పులేటి సాగర్, ఉప్పులేటి రమేష్, కోశాధికారి పెగడపల్లి చిన్న, కార్యదర్శులుగా ఉప్పులేటి నర్సయ్య, అధికార ప్రతినిధిగా మల్కళ్ళ ప్రసాద్ ను ఎన్నుకున్నారు. ఈ సమావేశం కు ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం అంతర్గాం మండల ఇంచార్జ్ ఉప్పులేటి పవన్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో దళిత సామాజిక హక్కుల పరిరక్షణ జిల్లా అధ్యక్షుడు చిలక ప్రసాద్ సీనియర్ దళిత సంఘాల నాయకులు కోరే శంకర్, మద్దిర్యాల మాజీ సర్పంచ్ భూపెల్లి లతా రాజేష్ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు ఉప్పులేటి నరేష్, ముల్కల్ల భీమయ్య, ఉప్పులేటి శ్రీనివాస్,ఉప్పులేటి శంకర్, జానీ పాషా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *