నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలలో 5వ రోజు అమ్మవారు “స్కందమాతా” అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. “”సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా శుభమస్తు సదా దేవి స్కందమాతా యశస్వినీ”” అంటూ అమ్మవారిని ఆరాధించడం ద్వారా ఆత్మవిశ్వాసంతో పాటు జ్ఞానం శక్తి సుఖశాంతులు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆలయ వైదిక బృందం అమ్మవారికి విశేష అర్చన పూజలను నిర్వహించి పెరుగు అన్నం ను నైవేద్యం గా నివేదించారు.వేకువ జామునే భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి దర్శనానికి క్యూలైన్ లో బారులు తీరారు.పోలీసు గట్టి బందోబస్తు మధ్య స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో ఆలయ అనువంశిక ఛైర్మెన్ శరత్ పాఠక్, ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్ ఆధ్వర్యంలో ఆలయ ఈఓ విజయ రామరావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఆలయ ఉచిత అన్నదాన సత్రంలో జగదీష్ మహారాజ్ స్వామీజీ బృందం (మరియు) సాతెల్ గణేష్ నివాసం వద్ద తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సేవకుల భక్త బృందం కులాలకు అతీతంగా అమ్మవారి భక్తులకు ఉచితంగా అన్నదాన ప్రసాదం ను అందజేస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఉచితంగా ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువులు,సెల్ఫోన్ వంటి వాటికి ఏలాంటి నగదును చెల్లించకుండా ఉచితంగా మొబైల్ సౌకర్యం కల్పించారు. ప్రతి సంవత్సరం సెల్ఫోన్ పాయింట్ లాకర్ కోసం బహిరంగంగా టెండర్లను నిర్వహించి సుమారు ఆలయానికి 15 లక్షలకు పైగా ఆదాయం వచ్చేదని అలా ఆదాయ మార్గం చూడకుండా రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు భక్తులకు ఉచితంగా సెల్ పాయింట్ ను అందుబాటులోకి తెచ్చామన్నారు ఆలయ కార్యనిర్వణాధికారి. విజయరామారావు తెలిపారు.
ఆశ్వీయుజ శుద్ధ పంచమి నాడు దుర్గా, నవ దుర్గల్లో అయిదో అవతారంగా దుర్గాదేవి నవరాత్రులలో “స్కందమాతా” అమ్మవారిని కొలుస్తారు కొన్నిచోట్ల పద్మాసన దేవి, విద్యావాహిని దుర్గా దేవి అని కూడా పిలుస్తారు.
దుర్గాదేవి దేవసూర్ యుద్ధంలో సేనాధిపతి అయిన స్కంద భగవానుని తల్లి కాబట్టి… స్కందమాత గా అమ్మవారిని భక్తులు ఆరాధిస్తారు. అమ్మవారి ఒళ్ళో స్కందుడు (కుమారస్వామి) కూర్చోగా సింహ వాహినియై నాలుగు చేతులలో కమలం, జల కలశం, ఘంటా ధరించి అభయ ముద్ర తో అమ్మవారు స్కందమాత అవతారంలో భక్తులను అనుగ్రహిస్తోంది.
