ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకుమద్దతుగా సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం నాలుగు రోజులపాటు జరిగే కార్యక్రమాల్లో భాగంగా బొబ్బిలి టౌన్, శ్రీ వేణుగోపాలస్వామి గుడి నుండి గొల్లి వీధిలో గల శ్రీ కృష్ణ ఆలయం మరియు ఎల్లమ్మ తల్లి ఆలయం మీదుగా శ్రీ వైభవ వెంకటేశ్వరస్వామి ఆలయం వరకు జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు ఆధ్వర్యంలో,నగర సంకీర్తన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ రౌతు రామ్మూర్తి నాయుడు, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షులు సుంకర సాయి రమేష్ , బొబ్బిలి కౌన్సిలర్లు శ్రీమతి కింతలి శ్రీదేవి , శ్రీమతి సాలా స్వప్న , మున్సిపల్ కౌన్సిల్ టిడిపి ఫ్లోర్ లీడర్ గెంబలి శ్రీనివాసరావు , మాజీ కౌన్సిలర్ శ్రీమతి బీసపు పార్వతి , జనసేన మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, మరడాన రవి, జనసేన మరియు తెలుగుదేశం పార్టీ వీర మహిళలు కోటగిరి మానస గారు, భద్రగిరి సత్య, తులసి యామిని, లక్ష్మి, సంధ్య, సంతు తదితర ఎన్ డి ఏ కూటమి నాయకులు, జనసైనికులు, సనాతన ధర్మ పరిరక్షకులందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కోలాటం న్రృత్య ప్రదర్శన, భజన బ్రృందాలు పాడిన భక్తి గీతాలు, శ్రీ వెంకటేశ్వరస్వామి రథం, గోవింద సంకీర్తనలు ఆద్యంతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా బొబ్బిలిలో జరిపిన నగర సంకీర్తన
