విజయనగరం జిల్లా మెంటాడ మండలం జయతి పంచాయితీలోని బిరసాడవలస గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ తల్లి, సంకు దేవత తల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం విగ్నేశ్వర పూజ, పుణప్రవచనం, మండపారాధన, కుంకుమ పూజ, దుర్గా హోమం, పూర్ణాహుతి తదితర పూజా కార్యక్రమాలను వేద పండితులు వేదుల భువన ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా జరిపించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు జరిపారు. అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూజారి ఈదిబిల్లి పెంటయ్య, టోకరు రామకృష్ణ, కోట అచ్యుతరావు, గొప్పల బాలాజీ, ఈదిబిల్లి పైడితల్లి, గ్రామ పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవం
