ఓ “మాస్టర్ ప్లాన్” ప్రకారం సమగ్రాభివృద్ధి

Minister Dr. Pongu Narayana's visit to Nellore focused on resolving local issues and enhancing development across divisions 3, 4, and 5, emphasizing cleanliness and infrastructure improvement. Minister Dr. Pongu Narayana's visit to Nellore focused on resolving local issues and enhancing development across divisions 3, 4, and 5, emphasizing cleanliness and infrastructure improvement.
  • నెల్లూరు 3, 4, 5 డివిజన్లో విస్తృతంగా పర్యటించిన మంత్రి నారాయణ
  • ఆయా డివిజన్ల అభివృద్ధితో పాటు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి
  • ఖాళీ ప్రదేశాల్లో పిచ్చి మొక్కలను వెంటనే క్లీన్ చేయాలని ఆదేశం
  • గత ప్రభుత్వ డ్రెయిన్ల నిర్మాణంపై తనదైన శైలిలో చురకలు
  • క్రమక్రమంగా సమస్యల పరిష్కారంతోపాటు నెల్లూరు అభివృద్ధి లక్ష్యం
  • డివిజన్లకు విచ్చేసిన మంత్రి నారాయణకు ఘనస్వాగతం పలికిన ప్రజలు
  • ప్రజలతో మమేకమై ఎంతో ఆప్యాయంగా పలకరించిన మంత్రి నారాయణ
  • ప్రజల వద్ద నుంచి సమస్యలు అడిగి తెలుసుకుని అక్కడకక్కడే కొన్నింటిని పరిష్కరించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

ఓ మాస్టర్ ప్లాన్ ప్రకారం… ప్రజల అభిష్టం మేరకు… ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలే కాకుండా… తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తూ… నెల్లూరు సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 3, 4, 5 డివిజన్లో అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి శుక్రవారం ఉదయాన్నే మంత్రి విస్తృతంగా పర్యటించారు. ఆయా డివిజన్లకు విచ్చేసిన మంత్రి నారాయణకు స్థానిక నాయకులు, ప్రజలు అపురూప స్వాగతం పలికారు. అడుగడుగునా సాలువాలు, పూలమాలలతో సత్కరించారు. ఆయా డివిజన్లలో మంత్రి స్వయంగా ప్రజలతో మమేకమై మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమతో ఎంతో చొరవగా ఉన్న మంత్రి నారాయణను ప్రజలు ఆప్యాయంగా పలకరించి తమ సమస్యలను తెలియజేశారు. సార్… ఏ మంత్రి కూడా ఈ విధంగా ప్రజల మధ్యకు ఇంత దగ్గరగా వచ్చి సమస్యలు అడిగింది లేదు… కానీ మీరు మా మధ్యకు వచ్చి మా సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరించేందుకు మీరు చూపుతున్న చొరవకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ ప్రజలు మంత్రి నారాయణ ను అభినందించారు. ఆయా డివిజన్లలో ఉన్న సమస్యలను స్వయంగా పరిశీలించిన మంత్రి వెంటనే వాటిని పరిష్కరించాలని నగర పాలక సంస్థ కమిషనర్ సూర్య తేజను ఆదేశించారు. ప్రజల విన్నవించిన పలు సమస్యలను మంత్రి అక్కడకక్కడే పరిష్కరించారు. దీంతో మంత్రి నారాయణ చల్లంగుండాలయ్య అంటూ ప్రజలంతా దీవించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ ప్రజల అభిష్టం మేరకు ఓ మాస్టర్ ప్లాన్ ప్రకారం నెల్లూరును సమగ్ర అభివృద్ధి చేస్తానని మాటిచ్చారు. డివిజన్లలో పర్యటించినప్పుడు కొన్ని ప్రాంతాలు బాగుంటే మరికొన్ని ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉన్నది గుర్తించామని తెలిపారు. అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలను వెంటనే శుభ్రపరచాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించామన్నారు. అదేవిధంగా ఖాళీ స్థలాల్లో వ్యర్ధాలు, చెట్లను తొలగించేలా చర్యలు చేపట్టాలని తెలియజేశారు. దోమల వృద్ధికి అపరిశుభ్ర ప్రదేశాలే కారణమని… అలాంటి ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా నెల్లూరు ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. గత ప్రభుత్వంలో అవగాహన లేకుండా కాలువల నిర్మాణం వల్ల ఎందుకు ఉపయోగపడని పరిస్థితి ఏర్పడిందన్నారు. గతంలో వారు నిర్మించిన డ్రైన్లకు కంట్యూనేషన్ లేకపోవడంతో ఆయా ప్రదేశాల్లో అపరిశుభ్ర వాతావరణం ఉంటుందని చెప్పారు. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రణాళికా ప్రకారం డ్రెయిన్లు, రోడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. తద్వారా చిన్న డ్రైన్ల నుంచి మెయిన్ కెనాల్ కు మురికి నీటి సరఫరా జరుగుతుందని తెలిపారు. సింహపురి ప్రజలకు సుపరిపాలన అందిస్తూ, నెల్లూరును అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు తాను ప్రతినిత్యం ఆయా డివిజన్ల నాయకులు, అన్ని శాఖల అధికారులతో తాను ఎక్కడ ఉన్న ప్రతిరోజు సమీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్రమక్రమంగా సమస్యలన్నిటిని పరిష్కరించుకుంటూ నెల్లూరును అన్ని విధాల అభివృద్ధి చేసుకోవడమే ధ్యేయంగా… ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటామని మంత్రి నారాయణ ఘంటాపదంగా తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *