గాంధీ మార్గంలో నడవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపు

Nirmal District Collector Abhilash Abhinav honored Mahatma Gandhi on his birth anniversary, urging all to follow his peaceful and moral path. Nirmal District Collector Abhilash Abhinav honored Mahatma Gandhi on his birth anniversary, urging all to follow his peaceful and moral path.

జాతిపిత మహాత్మా గాంధీ చూపిన బాటలో మనమంతా నడవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్ ,కిషోర్ కుమార్ లతో కలిసి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. స్వాతంత్ర సంగ్రామంలో శాంతియుత మార్గంలో పోరాటం చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన గొప్ప వ్యక్తి గాంధీ అని కొనియాడారు. స్వాతంత్ర పోరాటంలో ముందుండి ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచి శాంతి, ధర్మం ,సత్యం ,అహింస మార్గాల్లో పోరాటం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ భుజంగరావు’ ఏవో సూర్యారావు వివిధ శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *