కామారెడ్డి జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా వివిధ ఎస్టి సంఘాల నాయకులు ఘనంగా స్వాగతం తెలిపారు.
ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లాలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది, అందులో తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ మాట్లాడారు.
ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర గౌరవ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్ణ చేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు.
“ఉచిత బస్సు ప్రయాణం, గృహ జ్యోతి, వంట గ్యాస్ సబ్సిడీ” వంటి కార్యక్రమాలను మహిళలకు అందిస్తున్నారు అని చెప్పారు.
రైతుల రుణమాఫీ విషయంలో, రెండు లక్షల రుణమాఫీ ఇవ్వడం జరుగుతుందని, కొంతమంది రైతులకు కొంత సమయం తీసుకుంటే త్వరలో వారికీ కూడా రుణమాఫీ కల్పించబడుతుంది.
ఎస్టీలకు పట్టా ఇవ్వాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన విషయం కూడా బెల్లయ్య నాయక్ చెప్పారు, అందరూ పంట పండించి బతుకుతున్న రైతులకు పట్టాలు అందిస్తామని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి పనులను చూసి బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు, ప్రజలు వాటిని నమ్మడం లేదు అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు రాణా ప్రతాప్ రాథోడ్, మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు, వారి కృషి అభినందనీయమని పేర్కొన్నారు.

 
				 
				
			 
				
			