కర్నూలు జిల్లా కోసిగి,మంత్రాలయం, నందవరం, డోన్, కడప జిల్లా కమలాపురం లో రెండు నెలల క్రితం పంప్ హౌస్ లో కాపర్ వైర్ చోరీ కేసులు నమోదయ్యాయి. కర్నూలు
స్పెషల్ బ్రాంచ్,
సైబర్ సెల్ పోలీసులు లోకల్ పోలీసుల తో కలసి దర్యాప్తు చేపట్టారు.నిన్న సాయంత్రం నాగులదీన్నే బ్రిడ్జ్ దగ్గర నిందితులను అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ తెలిపారు.నిందితులు మరోసారి దొంగతనానికి వచ్చారని తెలిసి పక్కా సమాచారం తో దాడి చేసి పట్టుకున్నట్లు డిఎస్పీ తెలిపారు. వారి నుండీ 9 లక్షల నగదు,25 కేజీల కాపర్ వైర్,ఒక మినీ లారీ,ఒక జైలో కారు సీజ్ చేసినట్లు డిఎస్పీ తెలిపారు.
నిందితులు గతంలో రాయలసీమ లొ పలుచోట్ల ఈ తరహా చోరీలకు పాల్పడినట్లు డిఎస్పీ మీడియాకు తెలిపారు.
పంప్ హౌస్ కాపర్ వైర్ చోరీ కేసుల్లో నిందితుల అరెస్టు
పంప్ హౌస్ కాపర్ వైర్ చోరీ కేసుల్లో నిందితుల అరెస్టు
