కాకుమాను మండలంలో వ్యవసాయాధికారి కే. కిరణ్మయి అప్పాపురం ,కాకుమాను గ్రామాలలో నీటి ముంపుకు గురైన వరి పంట పొలాలను పరిశీలించారు.
ఈ కార్య్రమంలో లాం శాస్త్రవేత్తలు యం.నగేష్ , ఎస్. ప్రతిభ శ్రీ , వి. మనోజ్ మరియు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
ఇందులో భాగంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ వరి పంట పొలంలో నీటిని తీసివేసి 30 కిలోల యూరియా+ 15 కిలోల MOP అదనం గా(booster dose) వేసుకోవాలి. BLB వచ్చే అవకాశం ఉంది కనుక పొటాష్ తప్పనిసరిగా వేసుకోవాలి.
నేరుగా విత్తిన వరిలో నెల రోజుల లోపు వున్న పంటలో మొక్కలు చనిపోయినట్లయితే అక్కడ ఒత్తుగా వున్నచోట మొక్కలు పీకి నాటుకోవాలి. లేదా నారు తెచ్చుకొని నాటుకోవాలని రైతులకు సూచించారు.
రైతులు మాట్లాడుతూ NLR33892 రకమే వేసుకోవటానికి అనుకూలం గనుక నారు తెచ్చుకోవటం గానీ నారుమడి వేయటం గానీ చేస్తాం అని అన్నారు.
మండల వ్యసాయాధికారి మాట్లాడుతూ పంట నష్టము అంచనా వేసి నివేదిక సమర్పించాలని స్థానిక వి ఎ ఎ మహేంద్ర నాయక్ ను ఆదేశించారు.
మరియు అన్ని రైతు సేవా కేంద్రాలలో ఈ క్రాప్ బుకింగ్ జరుగుతూ ఉందని రైతులు అందరూ ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోవాలని మరియు తప్పనిసరిగా ఈ కే వై సీ చేయించుకోవాలని రైతులకు తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో వి ఎ ఎ లు మహేంద్ర నాయక్ , శ్వేత కృష్ణ ప్రియ మరియు ఆయా గ్రామ రైతులు పాల్గొన్నారు..
