విజయనగరం జిల్లాలోని మెంటాడ మండలంలో సోమవారం మండల ప్రత్యేక అధికారి ప్రమీల గాంధీ పర్యటించారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా లోతుగెడ్డ, ఆండ్ర జగన్నాధపురం తదితర గ్రామాలలో పర్యటించారు. పొంగుతున్న వాగులను పరిశీలించారు. ఏ ఒక్కరు కూడా ప్రమాదకరంగా ఉన్న వాగులను దాటవద్దని కోరారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించి వరదల కారణంగా ఎలాంటి నష్టం జరగకుండా తీసుకుంటున్న చర్యలను వివరించారు. మంగళవారం జరిగే ఆండ్ర సంతకు ఇతర ప్రాంతాల నుంచి గిరిజనులు ఎక్కువగా రానుండడంతో ముందస్తు జాగ్రత్తలలో భాగంగా సంతను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎంపీడీవో త్రివిక్రమరావు, పంచాయతీ ఆఫీసర్ విమల కుమారి,టిడిపి మండల అధ్యక్షుడు చలుమూరి వెంకట్రావు, గొర్రెల ముసలి నాయుడు, మన్నెపురి రామచంద్రుడు, తదితరులు పాల్గొన్నారు.
మెంటాడలో ఎంపీడీవో ప్రమీల గాంధీ పర్యటన
విజయనగరం మెంటాడలో ఎంపీడీవో ప్రమీల గాంధీ, వరద కారణంగా గ్రామాలలో పర్యటించి, సంత రద్దు నిర్ణయం తీసుకున్నారు. వాగులను ప్రమాదంగా పేర్కొని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
