గణేష్ నిమజ్జనం చేయాలనీ రాచకొండ సీపీ సుధీర్ బాబు ఆదేశాలు

గణేష్ నిమజ్జనం చేయాలనీ రాచకొండ సీపీ సుధీర్ బాబు ఆదేశాలు

గణేష్ నిమజ్జనం ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా రాచకొండ కమిషనరేట్ సీపీ సుధీర్ బాబు, రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలో గల సరూర్ నగర్ చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి వారికి దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా రాచకొండ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు సజావుగా సాగేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, సరూర్ నగర్ లో నిమజ్జనం కోసం 8 క్రేన్లు ఏర్పాటు చేస్తామని, జిహెచ్ఎంసి సహకారంతో బారికేడ్లు, మంచినీటి వసతి, గజ ఈతగాళ్లు, లైటింగ్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని, నిమజ్జనం రోజున ఎలాంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా 55 సీసీటీవీలను ఏర్పాట్లు చేశామని, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించామని, ఈసారి మరింత కట్టుదితమైన భద్రత చర్యలతో నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట డిసిపి ప్రవీణ్ కుమార్, ఇతర అధికారులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *