రేగిడి మండలంలో వరద ప్రభావం, పంట పొలాలు ముంపు

తుఫాను వలన రేగిడి మండలంలో వరద, పంటలు ముంపు. టిడిపి నాయకుల పర్యవేక్షణలో బ్రిడ్జి శుద్ధి, ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. రేగిడి మండలంలో వరద ప్రభావం, పంట పొలాలు ముంపు

విజయనగరం జిల్లా, రాజాం నియోజకవర్గం, రేగిడి ఆమదాలవలస మండలం లో గత రెండు రోజులుగా తుఫాన్ కారణంగా ఎడతెరిపిలేని వర్షాలు కురవడం వలన, ఒక ప్రక్కన నాగావళినది ఉదృతం మరియు ఆకులు కట్ట గడ్డ పొంగడం మండలంలో వెంకటాపురం, కోడిస వెళ్లే రహదారి ఏ కే ఎల్ గడ్డ ద్వారా తుఫాను కారణంగా వచ్చే వరద వలన బ్రిడ్జి దగ్గర గుర్రపు డెక్క, పిచ్చి మొక్కలు బ్రిడ్జికి అడ్డంగా ఉండటం వలన. పంట పొలాలు ముంపికి గురి కావడం.
గోగుల తమ్మి నాయుడు జెసిబి తెచ్చి బ్రిడ్జిలో ఇరుక్కున్న గుర్రపు డెక్కన్ రైతుల సహాయంతో తొలగిస్తున్నారు.
రేగిడి, బొడ్డవలస, చెనికాని వలస, వెంకంపేట, సంకిలి మదురై చిన్నయ్య పేట గ్రామాల్లో తాసిల్దార్ ఎల్లారావు, టిడిపి బృందం రైతు సంఘం బృందం పర్యవేక్షణలో సిబ్బందికి సూచనలు ఇస్తూ, రైతులకు, ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు మాజీ డిసిసిబి ఉపాధ్యక్షులు ధూబ ధర్మారావు, రేగిడి మండల టిడిపి అధ్యక్షులు కిమిడి అశోక్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నారు జనార్దన్ రావు మరియు రైతులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *