కాకుమాను మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం సర్వ సభ్య సమావేశం జరిగింది. ఎంపీపీ రామినేని శ్రీనివాసరావు , మండల జడ్పిటిసి ముజావర్ గుల్జార్ బేగం, వైస్ ఎంపీపీ కపిల్ దేవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ప్రతి గ్రామంలో ఎటువంటి సమస్యలు లేకుండా, ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రతి అధికారి పనిచేయాలని సూచించారు. మండలంలో చేయవలసిన అభివృద్ధి పనులు, పనుల గుర్తింపు తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీల తో పాటు ఎంపీడీవో రామకృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు..