ఆధార్, పాన్ లోపాలు సరిచేసే విధానం

 

ప్రస్తుతం ఏ పని చేయాలన్నా ఆధార్ కార్డు , పాన్ కార్డు అనేవి కీలమైన డాక్యుమెంట్లుగా మారాయి. ప్రభుత్వ, ప్రైవేటు పనులకు ఈ రెండూ అవసరం. చాలామందికి ఈ రెండు కార్డుల్లో ఉండే పేర్లు లేదా ఇంటి పేర్లు మ్యాచ్ కావు. తప్పులు దొర్లుతుంటాయి. వీటిని ఎలా సరి చేసుకోవాలి. ఆ వివరాలు మీ కోసం.

సాధారణంగా ఆధార్ కార్డు, పాన్ కార్డులో ఇంటి పేరు వేర్వేరుగా ఉండవచ్చు లేదా షార్ట్ కట్‌లో ఉండవచ్చు లేదా తప్పులు ఉండవచ్చు. కొన్నింటిలో ఇంటి పేరే మిస్ అవుతుంటుంది. మొత్తానికి ఆధార్ కార్డు, పాన్ కార్డులో రెండింటిలోనూ ఒకేలాపేరు ఉండకపోవచ్చు. రెండింట్లో మీ పేరు మ్యాచ్ కాకపోతే పనులు సజావుగా పూర్తి కావు. మరి వీటిని ఆన్‌లైన్‌లో ఎలా సరి చేసుకోవాలో తెలుసుకుందాం

ప్రభుత్వ పని అయినా లేక ప్రైవేట్ పని అయినా ఆధార్ కార్డు, పాన్ కార్డు రెండూ అవసరమౌతుంటాయి. ఈ రెండూ ఐడీ ప్రూఫ్‌గా పరిగణిస్తుంటారు. ఈ రెండింట్లో వివరాలు మ్యాచ్ కాకపోతే పనులు ఆగిపోతుంటాయి. అందుకే రెండింట్లో పేరు ఇతర వివరాలు సరిగ్గా ఉండేట్టు చూసుకోవాలి. మీ ఆధార్ కార్డు, పాన్ కార్డులో కూడా ఇలానే ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంట్లోంచే ఆన్‌లైన్ విధగానంలో సరిచేసుకోవచ్చు.

దీనికోసం ముందుగా  ఇన్‌కంటాక్స్ అధికారిక వెబ్‌సైట్ www.incometaxindia.gov.in ఓపెన్ చేయాలి. మీ పాన్ కార్డు నెంబర్ ఆధారంగా లాగిన్ అవాలి. ఇప్పుడు పాన్ కార్డు కరెక్షన్ ఆప్షన్ ఎంచుకోవాలి.  అక్కడ అడిగిన వివరాలు నమోదు చేసి అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి. ఆ తరువాత సబ్మిట్ ఫామ్ ప్రెస్ చేసి కరెక్షన్ ఫీజు 106 రూపాయలు చెల్లించాలి. ఫీజు చెల్లించాక సబ్మిట్ చేస్తే మీకొక రిసీప్ట్ అందుతుంది. ఈ రిసీప్ట్ నెంబర్ ఆధారంగా మీ పాన్ కార్డు స్టేటస్ చెక్ చేయవచ్చు. కరెక్షన్ చేసిన పాన్ కార్డు నేరుగా మీ ఇంటికి వస్తుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *