నరసరావుపేట డీఎస్పీపై మాజీ మంత్రి విడదల రజినీ సంచలన ఆరోపణలు – “వదిలే ప్రసక్తే లేదు” హెచ్చరిక

మాజీ మంత్రి విడదల రజినీ మీడియా ముందు మాట్లాడుతున్న దృశ్యం

నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావుపై మాజీ మంత్రి విడదల రజినీ తీవ్ర ఆరోపణలు చేశారు. కొంతమంది పోలీసులు రౌడీల మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఆమె విమర్శించారు. డీఎస్పీ హనుమంతరావు పచ్చ ఖద్దర్‌ చొక్కా వేసుకొని టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని రజినీ ఆరోపించారు. తాను చేసిన పనులపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ALSO READ:పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల షెడ్యూల్‌ ఖరారు – డిసెంబర్‌ 1 నుండి 19 వరకు సమావేశాలు

టీడీపీ కార్యకర్తలు తమ నాయకుల మెప్పు కోసం తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని, అధికారులు కూడా ఆ ఫిర్యాదుల ఆధారంగా తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని రజినీ అన్నారు.

ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తాను న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తానని, పోలీసు వ్యవస్థలో రాజకీయ ప్రేరణలతో జరిగే చర్యలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *