గుంటూరు జిల్లాలో హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. అప్పు ఇవ్వలేదన్న కారణంతో బంధువులే వీరబాబుపై దాడి చేసి చంపేశారు. దుగ్గిరాల రజక కాలనీలో నివాసం ఉండే వీరబాబు తాపీ మేస్త్రిగా పనిచేస్తూ, అప్పుడప్పుడూ పరిచయస్తులకు డబ్బు అప్పు ఇస్తుండేవాడు.
ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ఇంటిలోనే ఉన్నాడు. ఈ క్రమంలో బంధువైన నవీన్ పది వేల రూపాయల అప్పు అడగగా, వద్దని చెప్పాడు. దీనితో ఘర్షణ తలెత్తింది.
ALSO READ:సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా – ఆకట్టుకున్న సైకత శిల్పం
కోపంతో నవీన్ తన బంధువైన క్రిష్ణను సంప్రదించి మద్యం సేవించాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి వీరబాబును వెంబడించి, ఆర్ఎంపి వద్ద తల్లితో ఉన్న సమయంలో కత్తులతో దాడి చేశారు.
రక్తపు మడుగులో పడిపోయిన వీరబాబును తెనాలి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిగా తేల్చారు. కన్న తల్లి కళ్ల ముందే జరిగిన ఈ ఘటనతో ఆవేదన వ్యక్తమవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి, నవీన్ మరియు క్రిష్ణ కోసం గాలిస్తున్నారు.
